Revanth Reddy: అసెంబ్లీ నియోజకవర్గాలకు 153కు పెంచాలి 5 d ago

TG : డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలని పేర్కొన్నారు. జనాభా నియంత్రణ శాపం కాకూడదని, జనాభా సంఖ్య తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నారు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలకు 153కు పెంచాలని, ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలన్నారు. కేంద్రం నిర్ణయాలతో ప్రజల్లో ఆందోళన నెలకొందని, అన్ని పార్టీలతో సంప్రదింపులు చేసిన తరువాతే లోక్ సభలో సీట్ల పునర్విభజన చేయాలన్నారు.
ప్రస్తుతం డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరుగుతోందన్నారు, ఇలా జరిగితే రాష్ట్రాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, ప్రస్తుతం ఉన్న లోక్ సభ నియోజకవర్గాలనే కొనసాగించాలని పేర్కొన్నారు. జనాభా ఆధారంగా చేసే పునర్విభజనను అంగీకరించబోమని, ఇలాంటి పునర్విభజనను వాజ్‌పేయి కూడా వ్యతిరేకించారని చెప్పారు.